నేడు వృద్ధులు - దివ్యాంగుల కోసం ప్రత్యకే టిక్కెట్లు విడుదల
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శ్రీవారి దర్శనం నిమిత్తం టిక్కెట్లను విడుదల చేస్తుంది. ఇందులోభాగంగా, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా దర్శన టిక్కెట్లను బుధవారం మధ్యాహ్న 3 గంటలకు విడుదల చేయనుంది. అదేవిధంగా ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటాను గురువారం విడుదల చేయనుంది.
కాగా, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయం వేళల్లో మార్పులు చేయనున్నారు. ఇప్పటివరకు ఉదయం 10 గంటలకు దర్శనాలకు అనుమతించేవారు. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నారు.