శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (12:07 IST)

ఒంటరిగా ఉన్న మహిళ.. ఇంటిచుట్టూ విద్యుత్ తీగలు.. ఎందుకు?

ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకుని ఆమెను చంపేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం సుర్ధపల్లిలో చోటు చేసుకుంది. కరెంటు షాక్ పెట్టి మహిళను హతమార్చేందుకు దుండగులు ప్రయత్నించారు. అర్థరాత్రి సమయంలో మహిళ ఇంటి చుట్టూ ఇనుపతీగలను చుట్టి విద్యుత్ సరఫరా చేసారు. 
 
ఉదయం విద్యుత్ తీగ తగిలి మహిళ కిందపడిపోయింది. ఆమెను గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు గ్రామానికి చేరుకున్న నేలకొండపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.