శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (11:56 IST)

అమెరికాలో ఉన్మాది వీరంగం.. ఈశాన్య సియోటెల్‌లో కాల్పుల మోత

అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. ఓ ఉన్మాది ఒకడు తుపాకీతో వీరంగం సృష్టించాడు. వాహనదారులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పులు ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఈశాన్య సియోటెల్‌లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈశాన్య సియాటెల్ ప్రాంతంలో ఉంటున్న ఓ దుండగుడు స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తుపాకీతో హల్‌చల్ చేశాడు. తొలుత కారును నిలువరించి అందులోని మహిళను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రతిఘటించడంతో కాల్పులు జరిపాడు. దీంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలిపోయింది.
 
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకోవడంతో అటుగా వెళుతున్న బస్సుపై కాల్పులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ సందర్భంగా శరీరంలోకి బుల్లెట్లు దూసుకుపోయినప్పటికీ చాకచక్యంగా బస్సును ఆపకుండా ముందుకు తీసుకెళ్లిపోయాడు. డ్రైవర్‌తో పాటు గాయపడ్డ మహిళను అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. 
 
అక్కడతో ఆగని ఆ ఉన్మాది అటుగా వెళుతున్న కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం కారును వేగంగా తీసుకెళ్లిన దుండగుడు.. ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో అందులోని వ్యక్తి ప్రాణాలు వదిలాడు. చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిపారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.