ఎస్ఐని చితకబాదిన హెడ్ కానిస్టేబుల్ ... ఎక్కడ?
ఓ హెడ్ కానిస్టేబుల్ తన పై అధికారిగా ఉన్న ఎస్.ఐను ప్రజలందరి ముందూ (పబ్లిక్ ప్లేస్) చితకబాదాడు. లాక్‌డౌన్ విధులు నిర్వహిస్తున్న తనను దూషించడంతో ఆయన ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సితాపూర్ జిల్లా కొత్వాలి నగర్‌లో జరిగింది.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. అయితే, ఓ చెక్‌పోస్టు వద్ద హెడ్ కానిస్టేబుల్ రామష్రాయ్ విధులు నిర్వహిస్తున్నాడు. అక్కడకు వచ్చిన ఎస్ఐ ఆ హెడ్ కానిస్టేబుల్‌ను దూషించాడు. దీంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చి లాఠీత పదేపదే కొట్టాడు. తన విధులు నిర్వహించకుండా దూషించినందుకు ఆ పని చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చివరకు జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లిడంతో తక్షణం స్పందించి హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. అంతేకాకుండా, ఎస్ఐపై దాడి చేసినందుకు హెడ్ కానిస్టేబుల్‌పై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.