సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:52 IST)

ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయలేను : వెంకయ్య నాయుడు

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని పట్టుబట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించాలని పట్టుబట్టిన మాట వాస్తవమేనని, కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. హోదా ఇవ్వలేమని, ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్రం వెల్లడించిన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి హోదా రప్పించే విషయంలో తానిప్పుడు ఏమీ చేయలేనన్నారు. 
 
అయితే, అందుకు సమానమైన నిధులను మాత్రం ప్యాకేజీ రూపంలో విదేశాల నుంచి రుణం తీసుకుని ఇప్పిస్తానని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90 శాతం నిధులు కేంద్రం, 10 శాతం నిధులు రాష్ట్రం ఖర్చు చేయాల్సి వుంటుందని, హోదా లేకుంటే 60:40 నిష్పత్తిలో నిధుల ఖర్చు ఉంటుందని గుర్తు చేసిన ఆయన, తేడాగా ఉన్న 30 శాతం నిధులు ఎంతైనా కేంద్రం ఇస్తుందని అన్నారు.