బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 6 అక్టోబరు 2021 (11:30 IST)

న‌లుగురితో పెళ్ళిళ్ళు... విశాఖ పోలీసు శాఖలో నిత్య పెళ్ళికొడుకు

విశాఖ‌లో ఓ నిత్య పెళ్ళికొడుకు బాగోతం ఇది. ఇప్ప‌టికే అత‌ను నాలుగు పెల్లిళ్ళు చేసుకున్న‌ట్లు బ‌య‌ట‌ప‌డింది. ఇంత‌కీ అత‌గాడు ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ . అందుకే ఆయ‌న‌గారి ఆట‌లు ఇన్నాళ్ళు సాగాయ‌ని చెపుతున్నారు. 
 
విశాఖ సిసిఆర్బి హెడ్ కానిస్టేబుల్  అప్పలరాజు బండారం బట్టబయలు చేసింది... ఓ అభాగ్యురాలైన మహిళ చేతన. అప్ప‌ల‌రాజు నిత్య పెళ్ళికొడుకుగా నలుగురు మహిళతో పెళ్లిళ్లు సాగించాడు. నలుగురితో కలిసి అయిదుగురు పిల్లల్ని కూడా కన్నాడు... ఆ నిత్య‌పెళ్లికొడుకు హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజు. పద్మ అనే మహిళను వివాహం ఆడి, కొద్ది రోజులు కాపురం చేసి, నాలుగు అబార్షన్ లు చేయించాడా ఘనుడు. మరో మహిళ కానిస్టేబుల్ తో వివాహానికి సిద్ధమ‌వ‌డంతో అప్పలరాజు నిత్య పెళ్లిళ్లు నిర్వకంపై నిలదీసింది భార్య‌ పద్మ. 
 
అంత‌కు ముందే అత‌గాడికి మ‌రో రెండు పెళ్ళిళ్ళు జ‌రిగిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. దీనితో మోసపోయిన ఈ మహిళ‌లకు అండగా నిలిచింది... మహిళ చేతన సంఘం. వారి సాయంతో దిశా పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ అప్పలరాజుపై ఫిర్యాదు చేశారు. అత‌డిని తక్షణమే విధులు నుండి తొలిగించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కె.పద్మ డిమాండు చేస్తోంది.