సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:25 IST)

విశాఖ కార్పొరేట‌ర్ కామేశ్వ‌రి దాష్టీకం, కోడ‌లుపై దాడి

విశాఖ 47వ కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి చిన్నారావు కలిసి కోడలు నందినిపై దాడి చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. బాధితురాలు నందిని ప్రస్తుతం అపస్మారకస్థితిలో కంచరపాలం రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కంచరపాలం ఎస్ఐ దివ్యభారతి బాధితురాలు నుండి వాంగ్మూలం తీసుకున్నారు. 
 
గతంలో ఇరువురి మధ్య గొడవలు జరిగి కేసులు నమోదు కావడంతో ఇరువురు శనివారం లోక్ అదాలత్ లో రాజీ అయ్యారు. అనంతరం మరల వైసిపి కార్పొరేటర్ కామేశ్వరి, ఆమె తండ్రి కలిసి కోడలు నందినిపై  సాయంత్రం దాడి చేశార‌ని, బాధితురాలి బంధువులు ఫిర్యాదు చేశారు. చిన్నారావు, కామేశ్వరి కలిసి దాడి చేయడంతో పురుగు మందు తాగి నందిని ఆత్మహత్య ప్రయత్నం చేసినట్టు చెపుతున్నారు. ప్రస్తుతం నందిని అపస్మారక స్థితిలో రామారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.