మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (15:04 IST)

నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికెళ్తే గొంతులో 9 సూదులు....

ఓ బాలిక గొంతు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గొంతులో 9 సూదులు ఉన్నట్టు గుర్తించి అవాక్కయ్యారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలి

ఓ బాలిక గొంతు నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె గొంతులో 9 సూదులు ఉన్నట్టు గుర్తించి అవాక్కయ్యారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే..
 
బెంగాల్ రాష్ట్రంలోని నాదియా జిల్లాలోని కృష్ణాగర్ ప్రాంతానికి చెందిన బాలిక గొంతు నొప్పితో జూలై 29వ తేదీన కోల్‌కతాలోని ప్రభుత్వ దవాఖానాలో చేరింది. ఆమెకు ఎక్స్‌రే తీసిన వైద్యులు గొంతు భాగంలో తొమ్మిది సూదులు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆపరేషన్ ద్వారా వాటిని తొలగించారు. 
 
గొంతు వెనుక భాగంలోనే 8 సూదులు ఆహార వాహిక దగ్గర్లో ఉన్నాయి. అసలు ఆమె గొంతులోకి ఆ సూదులు ఎలా వెళ్లాయే వైద్యులకు అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం ఆ బాలిక మాట్లాడే స్థితిలో లేదు. కానీ ఈ ఘటనకు సంబంధించిన కారణాలేంటనేది వైద్యులు వెల్లడించలేక పోతున్నారు.