మోదీని జగన్ ఏం అడుగుతారో?
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోడితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను సిఎం ప్రస్తావించనున్నారు.
రాష్ట్రం ఎదుర్కుంటున్న నిధుల కొరత గురించి ప్రధానంగా ముఖ్యమంత్రి వివరించనున్నారు. పోలవరం ప్రాజెక్టు, పునర్‌వ్యవస్థీకరణ చట్టం తదితర అంశాలు కూడా ప్రస్తావిస్తారు. అదే విధంగా అలాగే రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఇటీవల నిర్వహించిన సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చిన అంశం తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన కొన్ని రోజులకే ప్రధాని మోడీతో సిఎం భేటీ కానుండటంతో ఈ సమావేశంపై అనేక రకాల ఊహాగానాలు సాగుతున్నాయి.
అయితే, ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం తరువాత నదీ జలాల వివాదంపై జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సిఎం పాల్గొంటారు. ఆన్‌లైన్‌లో జరగనున్న ఈ సమావేశంలో తన నివాసం నుండే ముఖ్యమంత్రి పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ నుండే భాగస్వామి కానున్నారు.