ఆయనకు పూర్ణ కుంభం ఎందుకు? అదీ సింహాచలం క్షేత్రంలో... అపచారం!
సాధారణంగా వి.ఐ.పి.లు ఆలయాలకు వచ్చినపుడు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతుంటారు. అదీ, సీఎం, పీఎం, మంత్రులు, మఠాధిపతులు వంటి వారికి మాత్రమే పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. ఇక సింహాచలం వంటి పుణ్య క్షేత్రాల్లో పూర్ణ కుంభ స్వాగతం అంటే, ఆషామాషీకాదు. కానీ, ఇటీవల సింహాచల క్షేత్రంలో ఎంపీ విజయసాయిరెడ్డికి పూర్ణకుంభ స్వాగతం ఇవ్వడం వివాదాస్పదం అయింది. దీనిని ఖండిస్తున్నామని స్వామి శ్రీనివాసానంద సరస్వతి పేర్కొన్నారు.
విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రా? సీఎం జగన్ చెప్పాలి అంటూ శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. కేవలం రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయికి ఇంత ప్రాధాన్యం ఎందుకు కల్పించారని ప్రశ్నించారు. విశాఖ విజయసాయి జాగీరులా మారుతోందని, ఇక్కడి అధికారులను ఆయన పూర్తిగా ప్రభావితం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సింహాచల దేవస్తానం ఈవో కి ఆలయ మర్యాదలు తెలియవా అని శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు.