శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 సెప్టెంబరు 2023 (19:17 IST)

మంగళసూత్రం ఏమైందని అడిగిన పాపానికి భర్తను కొడవలితో..

crime scene
మదనపల్లిలో ఓ భార్య భర్తను దారుణంగా కొడవలితో దాడి చేసింది. మంగళసూత్రం ఏమైందని అడిగిన పాపానికి భర్తను కొడవలితో భార్య నరికేసిన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో చోటుచేసుకుంది. 
 
దివ్యాంగుడైన వెంకటరమణ, మంగమ్మలు భార్య భర్తలు. భార్య మెడలో ఉండాల్సిన తాళిబొట్టు కనిపించకపోవడంతో భర్త నిలదీశాడు. దీంతో ఆగ్రహానికి గురైన భార్య.. భర్తపై కొడవలి దాడి చేసింది. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకటరమణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.