ప్రియుడి మోజు.. భర్తను సెల్‌ఫోన్ ఛార్జర్ వైర్‌తో హత్య చేసి.. ఫ్యానుకు ఉరేసింది..
అక్రమ సంబంధాలతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. అదికూడా సెల్‌ఫోన్ చార్జింగ్ మెడకు చుట్టి భర్తను హత్యచేసి.. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ చివరికి దొరికిపోయింది.
శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తూరు కాలేజ్ రోడ్డుకు అనుకుని రాము(35), కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పాప శ్రీజ(7), బాబు సిద్దూ(5) ఉన్నారు. అయితే అక్టోబర్ 26న మరణించాడు.
ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఊరివేసుకుని ఉన్నట్టు కనిపించాడు. తొలుత అంతా ఆత్మహత్య అని భావించగా...అతని తల్లి మాత్రం తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వాదించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాముమృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి పంపించారు. అయితే పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లో రాముది హత్యగా తేలింది. దీంతో పోలీసులు రాము మృతిపై విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో భార్యే నిందితురాలని తేలింది.
రాము భార్య కుమారికి అదే గ్రామానికి చెందిన సొండి సతీష్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు గుర్తించారు. దీంతో కుమారితోపాటు సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వారిద్దరు నేరాన్ని అంగీకరించారు. రామును సెల్‌ఫోన్ చార్జర్‌తో హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.