శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2020 (13:55 IST)

రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకుంటే.. నెమలికి..?

peacock
రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకోగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక్కోసారి పూట గడువడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది తాను తినే దాంట్లో కొంత ధాన్యపు గింజలను రోడ్డు పక్కన కూర్చొని ఇలా నెమలికి తినిపిస్తుంది.
 
ఆ మహిళ ఇంట్లో సిరిసంపదలు లేకపోవచ్చు. కానీ ఆమె హృదయం అంతా సంపదే. దీనికి సంబంధించిన వీడియోను టింకు వెంకటేశ్ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 55 సెకన్ల పాటు నడిచే ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి వచ్చిన కాసేపటికే వైరల్‌గా మారింది. 
 
ఇప్పటివరకు ఈ వీడియోను నాలుగు లక్షలకు పైగా వీక్షించారు. మహిళ చేతిలో ఉన్న ధాన్యపు గింజలను తింటున్న నెమలిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మనుషులను చూస్తేనే పారిపోయే నెమళ్లు ఈ మహిళను నమ్మి దగ్గరకు రావడం గమనార్హం అంటున్నారు.