సంబంధిత వార్తలు
- అసెంబ్లీ సమావేశాలకు మోకాలడ్డలేదు... రాజస్థాన్ గవర్నర్
- రాజ్‌భవన్ నుంచి ప్రేమలేఖ అందింది.. గవర్నరుతో టీ తాగేందుకు వెళ్తున్నా : అశోక్ గెహ్లాట్
- 13ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారం...
- రాజస్థాన్‌లో రాజకీయ పోరు, గెహ్లట్ సర్కారుకు చుక్కెదురు
- సచిన్ పైలెట్‌కు తాత్కాలిక ఊరట : 24 వరకు చర్యలొద్దన్న కోర్టు
తుపాకీతో బెదిరించి మహిళపై గ్యాంగ్ రేప్
రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్‌లో దారుణం జరిగింది. ఓ మహిళపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తుపాకీతో బెదిరించి ఈ ఘాతుక చర్యకు పాల్పడ్డారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని ధోల్పూర్ పట్టణంలోని సైపావు ప్రాంతానికి చెందిన 27 యేళ్ళ ఓ మహిళను కొందరు యువకులు తుపాకీతో బెదిరించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక లైంగిక దాడి చేశారు.
ఆ కామాంధుల చెర నుంచి తప్పించుకుని వచ్చిన బాధితురాలు... పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన కామాంధులు పారిపోగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
