Festival Posters
✕

ఉన్నఫళంగా తెలంగాణ అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?

ఉన్నఫళంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది రాపోలు భాస్కర్ ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన వ్యాఖ్య

Written By pnr
Updated: శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (17:49 IST)
ఉన్నఫళంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది రాపోలు భాస్కర్ ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. పైగా, ఇపుడు మళ్లీ ఎన్నికలకు వెళ్లడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వ్యయం అవుతుందన్నారు.
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర మంత్రిమండలి ఏకవాక్య తీర్మానం చేసింది. దీన్ని ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ఆగమేఘాలపై ఆమోదించారు. అంటే ఐదేళ్ళు పూర్తికాకముందే 4 సంవత్సరాల 3 నెలల 5 రోజులకే కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం రద్దు అయింది. 
 
దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాపోలు భాస్కర్ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వం ఇంకా 9 నెలల ఉండగా ముందే అసెంబ్లీని రద్దు చేయడంపై పిటిషన్‌లో ఆయన అభ్యంతరాలను లేవనెత్తారు. ఉన్నఫళంగా అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. 
 
ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. 5 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకూ ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించనుంది.
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

అమ్మవారి దివ్యశక్తిని ఆవిష్కరిస్తూ మ్యూజికల్ టచ్ ఇచ్చిన మహాకాళి

ది ట్రైటర్స్ తెలుగు’ సీజన్ 1 విజేతలుగా నిలిచిన శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి

Anaswara Rajan: కాకాలో చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్రౌడ్‌గా ఉంది : అనస్వర రాజన్

బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హీరోగా ఫన్ చిత్రం పూజతో ప్రారంభం

లెక్కలు, ఎక్కాలు రాని నలుగురు కుర్రాళ్లు కు చంద్రయాన్ కు సంబంధం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments