ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 30 డిశెంబరు 2017 (17:10 IST)

మహిళను టీడీపీ నేతలు వివస్త్ర చేస్తే.. బాబు నోరెత్తలేదు: రోజా

విశాఖపట్నం పెందుర్తిలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసిన కొట్టారని.. అయినా ఏపీలోని చంద్రబాబు సర్కారు ఏమాత్రం నోరెత్తలేదని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. 2017 నారావారి నరకాసుర సంవత్సర

విశాఖపట్నం పెందుర్తిలో ఓ మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసిన కొట్టారని.. అయినా ఏపీలోని చంద్రబాబు సర్కారు ఏమాత్రం నోరెత్తలేదని వైకాపా ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. 2017 నారావారి నరకాసుర సంవత్సరమని రోజా ధ్వజమెత్తారు.

చంద్రబాబు సర్కారు, అరాచకాలు, ఆత్మహత్యలు, అత్యాచారం వంటి అబద్ధాలతో ఏపీ సాగుతోందని ఆరోపించారు. 
 
చంద్రబాబు పాలనలో క్యాలెండర్లు మారేయే కానీ.. తలరాతలు మాత్రం మారలేదని చెప్పుకొచ్చారు. కొత్త సంవత్సరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు వద్దంటూ ఆదేశించిన ప్రభుత్వం... 31వ తేదీన అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలను ఎందుకు అనుమతించిందని రోజా మండిపడ్డారు. 
 
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పథకాల్లో చంద్రబాబు ఒక్క శాతం కూడా చేయలేదని రోజా విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మహిళల కోసం ఎన్నో మంచి పనులు చేశారని... సబితకు హోంమంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఐదుగురు మహిళలను మంత్రులు చేశారని రోజా చెప్పారు. ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాలతో మహిళలకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు.