శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:57 IST)

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉంది : విజయసాయి జోస్యం

తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, అందుకే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి, అసహనంలో కూరుకునిపోయారని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ వెంటిలేటర్ మీద వున్న పార్టీ అంటూ సెటైర్లు వేశారు. అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. అందుకే బూతులు మాట్లాడిస్తూ కుంటిసాకులతో దీక్షలు చేస్తూ రాజకీయలబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. 
 
ఇక, టీడీపీ హయాంలో ప్రజా కంఠక పాలన సాగిందని గుర్తుచేసిన విజయసాయిరెడ్డి.. వైసీపీ పాలనలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారంటూ మండిపడ్డారు. అందుకే ప్రభుత్వం చేసే మంచి చంద్రబాబుకి నెగెటివ్‌గా కనిపిస్తోందన్నారు.
 
మరోవైపు నారా లోకేష్ అసహ్యకరమైన భాషతో ట్వీట్లు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సాయిరెడ్డి.. లోకేశ్‌ను సన్మార్గంలో పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని విజయసాయిరెడ్డి సూచించారు.