Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీరో ఫెర్ఫార్మెన్స్ వైకాపా ఎమ్మెల్యేలు వీరేనా?

Written By ఠాగూర్
Updated: బుధవారం, 8 జూన్ 2022 (17:27 IST)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం, సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రపై తాడేపల్లిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజినల్ కో ఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. అయితే, ఈ సమీక్షా సమావేశానికి ముందే ముఖ్యమంత్రి జగన్ ఆయా నియోజకవర్గాల్లోని పరిస్థితులను ఒక నివేదిక రూపంలో తెప్పించుకున్నారు. ఈ నివేదికను ఆయన బుధవారం బయటపెట్టారు. 
 
ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటివరకు కాలు మోపని నేతలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పి వారి పేర్లను కూడా బహిర్గతం చేశారు. ఈ ఏడుగురు ఎమ్మెల్యేల ఫెర్ఫార్మెన్స్ జీరోగా ఉందని సీఎం జగన్ సమీక్షలో కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. 
 
మరోవైపు, ఈ జాబితాలో ఉన్న ఎమ్మెల్యేలు వీరేనంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ ఏడుగురు ఎమ్మెల్యేల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నట్టు సమాచారం. వీరిలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌లు ఉన్నారు. 
 
అలాగే, వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని (ఆళ్ళ కాళికృష్ణ శ్రీనివాస్), ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నంద్యాల జిల్లా ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి ఉండగా, మరో ఎమ్మెల్యే పేరు బయటకు రావాల్సివుంది. ఈ లెక్కన చూస్తే పులివెందుల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. పైగా, ఆయన సీఎంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిచింన తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌కు పరిమితమై కాలు బయటపెట్టలేదనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్న విషయం తెల్సిందే. 

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments