భీమవరంలో పడుతూ లేస్తున్న పవన్ కల్యాణ్... లగడపాటి జోస్యం కరెక్ట్... ఒక్క ఓటుతోనైనా?

pawan kalyan
Last Updated: గురువారం, 23 మే 2019 (15:29 IST)
జనసేన పార్టీ స్థాయి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పూర్తిస్థాయిలో విడమర్చి చెప్పేశాయి. పవన్ కల్యాణ్ అన్నయ్య చిరంజీవికి కనీసం 18 సీట్లయినా వచ్చాయి. ఐతే పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకి ఒకటి పక్కన ఆ 8 కాస్తా పోయి 1 మిగిలే పరిస్థితి కనబడుతోంది. పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేయగా గాజువాక ప్రజలు పూర్తిగా గ్లాసును పక్కనపడేశారు.

ఇక భీమవరంలో మాత్రం బ్లింక్ బ్లింక్ మంటూ అప్పుడప్పుడు ఫ్యాను గాలికి పవన్ తట్టుకుంటున్నాడు. ప్రస్తుతం 9వ రౌండ్ ముగిసే సమయానికి పవన్ 200 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో వున్నారు. ఇంకా మరో 3 రౌండ్లు లెక్కించాల్సి వుంది. ఈ 3 రౌండ్లలో పవన్ ఫ్యాను గాలికి తట్టుకుని నిలబడగలిగితే లగడపాటి జోస్యం కొద్దిలో కొద్దయినా నిజమయ్యే ఛాన్స్ వుంది. అందుకే ప్రస్తుతం లగడపాటి రాజగోపాల్, పవన్ గెలుపు కోసం గట్టిగా ప్రార్థనలు చేస్తున్నాడట. అదీ సంగతి.దీనిపై మరింత చదవండి :