శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (16:21 IST)

మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్

bus yatra
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరింది. వైఎస్ఆర్ ఘాట్‌కు తన తల్లి విజయమ్మతో కలిసి నివాళులు అర్పించిన జగన్... ఆ తర్వాత బస్సు యాత్రను ప్రారంభించారు. తొలి రోజు రాత్రికి ఆయన నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో బస చేస్తారు. 
 
తొలిరోజు బస్సు యాత్ర ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయుని పల్లి, ఉరుటూరు, సున్నపురాళ్లపల్లి, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, దువ్వూరు, చాగలమర్రి, ఆళ్ళగడ్డ వరకు సాగుతుంది. అంతకుముందు తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో తన తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు తల్లి విజయమ్మ ముద్దుపెట్టి, ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. యాత్రకోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ఎక్కారు.