శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2024 (08:55 IST)

వైఎస్ జగన్ మరోమారు ఏపీ ముఖ్యమంత్రి అవుతారు : హీరో విశాల్ జోస్యం

vishal
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావడం తథ్యమని హీరో విశాల్ జోస్యం చెప్పారు. ఆయన కొత్త చిత్రం రత్నం. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మరోమారు సీఎం కావడం తథ్యమన్నారు. వైకాపాకు తాను బలమైన మద్దతుదారుడిని కాదనీ కానీ జగన్ వీరాభిమానిని అని చెప్పారు. 
 
రాజకీయ నాయకులు నటులుగా మారుతున్నారని, అందుకే నటులు కూడా రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమన్నారు. ఎక్కడో ఏపీ గదిలో కూర్చొని రాజకీయాలు చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లోకి రావాలంటే కొన్ని విషయాలు పూర్తిగా మరిచిపోవాలన్నారు. ఇకపోతే, జగన్‌పై గులకరాయి దాడి ఘటనపై స్పందిస్తూ, రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, మనం జాగ్రత్తగా ఉండాలని, ఇకపై ఆయన మరింత జాగ్రత్తగా ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు.