బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ప్రయాణికుల రద్దీ.. 10 ప్రత్యేక రైళ్ళు పొడగింపు

train
రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం నడుపుతున్న ప్రత్యేక రైళ్లను ఈ నెల ఆఖరివారం వరకు పొడగించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇలా పొడగించిన రైళ్లలో పది ఉన్నాయి. వాటి వివరాలను ఓసారి పరిశీలిస్తే, సికింద్రాబాద్ - తిరుపతి రైలును డిసెంబరు 4వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పొడగించారు. ఈ రైలు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అలాగే, తిరుపతి - సికింద్రాబాద్ రైలు ఈ నెల 3వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది.
 
ఇకపోతే, హైదరాబాద్ - నర్సాపూర్ రైలు డిసెంబరు 2 నుంచి 30వ తేదీ వరకు, నర్సాపూర్ - హైదరాబాద్ రైలు డిసెంబరు 3 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. కాకినాడ - లింగంపల్లి రైలు డిసెంబరు 1వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటాయి. లింగంపల్లి - కాకినాడ రైలు డిసెంబరు 2వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లోనూ, తిరుపతి - అకోలా, పూర్ణ - తిరుపతి మధ్య నడిచే రైళ్ళను కూడా ఇరు మార్గాల్లో నెలాఖరు వరకు పొడగించినట్టు దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది.