శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 11 మే 2018 (16:46 IST)

విద్యార్థినిని పెళ్లాడిన హెడ్ మాస్టర్.. 13ఏళ్ల బాలుడితో 23 ఏళ్ల యువతి వివాహం.. ఎక్కడ?

మాయమాటలు చెప్పి స్కూల్ హెడ్ మాస్టరే ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడు. విద్యార్థినితో పారిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకెళితే.. ముచ్చింతల్‌‌కు చెం

మాయమాటలు చెప్పి స్కూల్ హెడ్ మాస్టరే ఓ విద్యార్థిని జీవితాన్ని నాశనం చేశాడు. విద్యార్థినితో పారిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామంలో వెలుగుచూసింది. వివరాల్లోకెళితే.. ముచ్చింతల్‌‌కు చెందిన ఓ బాలిక పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణురాలు కాలేకపోయింది. 
 
ఫెయిలైన సబ్జెక్ట్.. పాస్ చేయిస్తానని చెప్పి బాలికకు మాయమాటలు చెప్పి హెడ్ మాస్టర్ అక్బర్ ఆమెను తీసుకెళ్లిపోయాడు. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శంషాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
మరోవైపు కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు మండలమైన కౌతాళంలోని ఓ కుగ్రామంలో వింత వివాహం జరిగింది. ఏప్రిల్ 27న జరిగిన ఈ వివాహం సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో వరుడి వయసు కేవలం 13 ఏళ్లు కాగా, వధువు వయసు 23 ఏళ్లు. 
 
భర్త మద్యానికి బానిస కావడం, తాను అనారోగ్యంతో బాధపడుతుండడంతో తాను మరణిస్తే పిల్లల గతి ఏమవుతుందోనని ఆలోచించిన ఆ తల్లి పెద్ద కుమారుడికి పెళ్లి చేయాలని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా బంధువుల అమ్మాయి (23)తో ఏప్రిల్ 27న పెళ్లి జరిపించింది. వివాహానికి వచ్చిన వారు వరుడిని చూసి అవాక్కయ్యారు. కొందరు కోపం పట్టలేక పెళ్లి పెద్దలను తిట్టిపోశారు. ఇదో రకమైన బాల్య వివాహమంటూ మండిపడ్డారు.