శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 10 మే 2018 (14:59 IST)

రాహుల్ గాంధీ నాకు 'రాఖీ బ్రదర్'... అదితీ సింగ్ కామెంట్.. ఎందుకని అలా?

ఈమధ్య కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పేరు బాగా పాపులర్ అయిపోతోంది. అటు ఉత్తరాది ఇటు దక్షిణాది ఆయన చేస్తున్న పనులు కావచ్చు, కామెంట్లు కావచ్చు, ఆయన గురించి నెట్లో జరుగుతున్న ప్రచారం కావచ్చు. ఏదైతేనేం ఆయన గురించి బాగా చర్చ అయితే జరిగిపోతోంది. ఇదిల

ఈమధ్య కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పేరు బాగా పాపులర్ అయిపోతోంది. అటు ఉత్తరాది ఇటు దక్షిణాది ఆయన చేస్తున్న పనులు కావచ్చు, కామెంట్లు కావచ్చు, ఆయన గురించి నెట్లో జరుగుతున్న ప్రచారం కావచ్చు. ఏదైతేనేం ఆయన గురించి బాగా చర్చ అయితే జరిగిపోతోంది. ఇదిలావుంటే రాహుల్ గాంధీ పెళ్లికాని ప్రసాద్ అని తెలిసిందే. 
 
ఆయన ఫలానా అమ్మాయిని పెళ్లాడుతున్నాడంటూ ఇప్పటికే చాలా రకాలుగా రూమర్లు వచ్చాయి. తాజాగా మరో గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. అదేంటయా అంటే, రాయ్ బరేలి కాంగ్రెస్ ఎమ్మెల్యే  అదితీ సింగ్ త్వరలో రాహుల్ గాంధీని పెళ్లాడబోతున్నట్లు ఆ ప్రచారం. దీనితో అంతా దీని గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు. దీనితో ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యే అదితీ సింగ్ పోస్ట్ పెట్టారు. 
 
రాహుల్ గాంధీ తనకు రాఖీ బ్రదర్ అనీ, ఆయనతో తనకు పెళ్లేంటి అని ప్రశ్నిస్తూ ఆ పోస్ట్ చేసింది. కాగా రాహుల్ గాంధీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఆయన ప్రక్కనే అదితీ సింగ్ కూడా వెళ్లి వస్తున్నారు. దీనితో ఆ ఫోటోలను పెట్టి నెట్లో ప్రచారం చేసేస్తున్నారు కొందరు.