సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:37 IST)

ఏపీఎస్‌ ఆర్టీసీలో 2 వేల మందికి పదోన్నతులు

ఏపీఎస్‌ ఆర్టీసీలో సుమారు 2 వేల మందికి పదోన్నతులు కల్పిస్తామని ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ ద్వారకాతిరుమలరావు తెలిపారు. ఆర్టీసీలో అడహక్‌ ప్రమోషన్లను రెగ్యులర్‌ చేసేలా చర్యలు చేపట్టామన్నారు.

అమలాపురం ఆర్టీసీ డిపోకు బుధవారం విచ్చేసిన ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘సర్వీస్‌ రూల్స్‌’ మార్చేస్తున్నారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

కొత్తవారికి మాత్రమే సర్వీస్‌ రూల్స్‌ మారతాయి తప్ప, పాత వారికి మార్పులేదన్నారు. 2020 జనవరి 1నుంచి కారుణ్య నియామకాలు నిర్వహించుకునేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు..

2016 నుంచి పెండింగ్‌లో ఉన్న నియామకాలపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. అనంతరం, ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులుగా గుర్తించిన వారికి పురస్కారాలను అందజేశారు.