శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:09 IST)

30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు

ఎర్రచందనం అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి మంగళం టాస్క్‌ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 30 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌పి మేడా సుందరరావు ఆదేశాల మేరకు సిఐ వెంకటరవి ఆధ్వర్యంలోని ఆర్‌ఎస్‌ఐ విశ్వనాధ్‌ బృందం సోమవారం నుంచి పూతల పట్టునాయుడుపేట రహదారిలో తనిఖీలు చేపట్టారు.

మంగళవారం తెల్లవారుజామున చంబడిపాలెం సమీపంలోని రోడ్డుకు 50 మీటర్ల దూరంలో పోలీసులను చూసి ఇద్దరు పారిపోయే ప్రయత్నం చేశారు. వీరు నెల్లూరు జిల్లా మైపాడు రోడ్‌ సత్యనారాయణపురంకు చెందిన పాలూరి బాలు, తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌కు చెందిన ఆర్‌.మణికంఠన్‌గా గుర్తించి అరెస్టు చేశారు.

వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ.30 లక్షలు ఉంటుందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌పి తెలిపారు.