గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (19:10 IST)

జగన్ ఆస్తుల విలువెంత? (వీడియో)

నవ్యాంధ్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, మంత్రులుగా 25 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ 25 మంది మంత్రుల్లో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. అయితే, 25 మంత్రులు, ఒక ముఖ్యమంత్రి జగన్‌తో కలిపి మొత్తం 26 మందిలో 23 మంది కోటీశ్వరులే. అలాగే, 17 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమొక్రకటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. 
 
ఏపీ మంత్రివర్గంలో ఉన్న 26 మంది సమర్పించిన ఎన్నికల ప్రమాణ పత్రాలు పరిశీలించిన తర్వాత ఏడీఆర్ ఓ నివేదికను తయారు చేసి విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఏపీ మంత్రివర్గంలో ఉన్న వారిలో అత్యంత ధనవంతుడు ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నిలిచారు. ఈయన ఆస్తి విలువ రూ.510 కోట్లు. ఆ తర్వా స్థానంలో రూ.130 కోట్ల ఆస్తితో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. మూడో స్థానంలో రూ.61 కోట్ల ఆస్తితో మేకపాటి గౌతంరెడ్డి ఉన్నారు. 
 
ఇకపోతే, మొత్తం 26 మందిలో 23 మంది అంటే 88 శాతం కోటీశ్వరులో కావడం గమనార్హం. మంత్రుల సగటు ఆస్తి రూ.35.25 కోట్లుగా ఉంది. అలాగే, కేబినెట్‌లోని మంత్రుల్లో 17 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 9 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. ఇకపోతే అప్పుల విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరికంటే ముందున్నారు. ఈయనకు రూ.20 కోట్ల అప్పులు ఉండగా, చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు రూ.12 కోట్లు, అవంతి శ్రీనివాస్‌కు రూ.5 కోట్ల అప్పులు అన్నట్టు ఏడీఆర్ నివేదిక పేర్కొంది.