శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 1 జులై 2021 (16:39 IST)

తెలుగు రాష్ట్రాల్లో 6 ప్రత్యేక రైళ్లు రద్దు

ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉండటంతో ఆరు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
 
విశాఖఫట్నం-కాచిగూడ రైలును జులై 1 నుంచి 14 వరకు, కాచిగూడ-విశాఖపట్నం రైలును జులై 2 నుంచి 15 వరకు, విశాఖపట్నం-కడప రైలును జులై 1 నుంచి 14 వరకు, కడప-విశాఖపట్నం రైలును జులై 2 నుంచి 15 వరకు, విశాఖపట్నం-లింగంపల్లి రైలును జులై 1 నుంచి 14 వరకు, లింగంపల్లి-విశాఖపట్నం రైలును జులై 2 నుంచి 15 వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది.
 
మరో వైపు ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ మార్గాల్లో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. 
 
సికింద్రాబాద్‌- అగర్తల రైలు జులై 5, 12న, అగర్తల-సికింద్రాబాద్‌ రైలు జులై 9, 16న బయల్దేరతాయి. అగర్తల-బెంగళూరు కంటోన్మెంట్‌ రైలు జులై 6 నుంచి 24 వరకు ప్రతి మంగళవారం నడుస్తుంది. 
 
బెంగళూరు కంటోన్మెంట్‌-అగర్తల రైలు జులై 9 నుంచి 27 వరకు ప్రతి శుక్రవారం బయల్దేరుతుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. అందుబాటులోకి మరో 45 ఎంఎంటీఎస్‌ సర్వీసులు..
 
గురువారం నుంచి హైదరాబాద్‌లో మరో 45 ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్-లింగంపల్లి మార్గంలో 12 సర్వీసులు, లింగంపల్లి-హైదరాబాద్‌ 12 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి వయా రామచంద్రాపురం 16 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా వయా రామచంద్రాపురం 15 సర్వీసులు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 
 
ఇప్పటికే 10 ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయని వాటికి అదనంగా మరో 45 సర్వీసులు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.