ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (09:01 IST)

సత్యసాయి జిల్లాలో దారుణం : 8 మంది కూలీల సజీవదహనం

auto fire
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలో ఘోరం జరిగింది. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగి ఒక ఆటోపై పడ్డాయి. ఆ సమయంలో ఆటోలో ఉన్న 8 మంది కూలీలు సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ ప్రమాదంలో సజీవదహనమైనవారంతా జిల్లాలోని గుడ్డంపల్లికి చెందిన కూలీలుగా గుర్తించారు. వ్యవసాయ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలను ఆరాతీస్తున్నారు.