ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 1 మే 2021 (16:48 IST)

చిలకలూరిపేట వద్ద రోడ్డుపై వెళుతున్న కారులో మంటలు, దగ్ధం

చిలకలూరిపేట: చెన్నై- కోల్కతా జాతీయ రహదారిపై నాదెండ్ల మండలం గణపవరం వద్ద గురువారం ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తగలబడింది. తెనాలిలో మాంటిస్సోరి స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జేమ్స్ మొరైలీ తన కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి కేరళ వెళ్లి అక్కడి నుంచి చెన్నైకు, చెన్నై నుంచి తెనాలి వస్తున్నాడు.

సిఆర్ కళాశాల సమీపంలోకి రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారు పక్కగా ఆపి అందరూ కిందకు దిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అవగా, రెండు ల్యాప్‌టాప్‌లు, 15 వేల రూపాయల నగదు, దుస్తులు కాలిపోయాయి.