శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (05:31 IST)

వాగులోకి దూసుకెళ్లిన కారు..ఆరుగురి మృతి

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. టవేరా వాహనం వాగులోకి దూసుకెళ్లిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి.

మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కాకుమాను గ్రామానికి చెందిన బంధువులంతా గుంటూరు రూరల్‌ మండం ఏటుకూరులో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులను సమాధుల శ్రీను(50), పొగడ్త వీరలక్ష్మి (48) సమాధుల వన్నూరు (55) సమాధుల సీతమ్మ(65) పొగడ్త రమణ(48) గా గుర్తించారు.

మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.