శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 21 ఫిబ్రవరి 2020 (15:32 IST)

చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యేపై బండరాళ్లు, కత్తులు రాడ్లతో దాడి..

చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు శ్రీమ‌తి విడ‌ద‌ల ర‌జిని కారుపై టీడీపీ ఉగ్ర‌మూక‌లు దాడికి పాల్ప‌డ్డారు. బండ‌రాళ్లు, క‌త్తులు, రాడ్లుతో రెచ్చిపోయారు. కోట‌ప్ప‌కొండ తిరునాళ్ల సంద‌ర్భంగా ఎమ్మెల్యే స్వ‌గ్రామంలో పురుషోత్త‌మ ప‌ట్ట‌ణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు 5 భారీ విద్యుత్ ప్ర‌భ‌ల‌ను ఏర్పాటు చేశారు. ఆయా ప్ర‌భ‌ల‌న్నింటిని గురువారం రాత్రికి కోట‌ప్ప‌కొండ‌కు చేర్చారు. 
 
ప్ర‌భ‌లు సుర‌క్షితంగా కొండ‌కు చేరేవ‌ర‌కు ఎమ్మెల్యే భ‌ర్త కుమార‌స్వామి, మ‌రిది విడ‌ద‌ల గోపి త‌దిర‌తులు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు. రాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో వారు వెనుదిరిగారు. తిరిగి వ‌స్తుండ‌గా.. క‌ట్టుబ‌డివారిపాలెం గ్రామం దాట‌గానే వీరు ప్ర‌యాణిస్తున్న వాహ‌నంపైకి ఒక్క‌సారిగా టీడీపీ నాయ‌కులు బండ‌రాళ్లు విస‌ర‌డం ప్రారంభించారు. క‌త్తులు, రాడ్లుతో దాడికి తెగ‌బ‌డ్డారు.
 
 
ప‌ది మందికి తీవ్ర గాయాలు
ఘ‌ట‌న‌లో సుమారు ప‌దిమందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. దాడి స‌మ‌యంలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యేను దుర్భాష‌లాడారు. క‌మ్మ వారికే సొంత‌మైన చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో బీసీ మ‌హిళ ఎలా గెలుస్తుందంటూ హెచ్చ‌రించారు. ఎమ్మెల్యేను గ్రామాల్లో తిర‌గ‌నివ్వ‌కుండా అడ్డుకుంటామంటూ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. అస‌భ్య‌ప‌ద‌జాలంతో దూషించారు. 
 
టీడీపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వ్య‌తిరేకంగా నినాదాలుచేశారు. టీడీపీ గూండాలు రెచ్చిపోవ‌డంతో ఆ ప్రాంత‌మంతా యుద్ధ‌వాతావార‌ణాన్ని త‌ల‌పించింది. కారులో ఎమ్మెల్యే ఏదిరా. ఎమ్మెల్యే అనుకుని ఆపాం. కారులో ఉండి ఉంటే చంపేసే వాళ్లం నా కొడకల్లారా అంటూ టీడీపీ గూండాలు ఊగిపోయారు
ప‌క్కా ప్ర‌ణాళిక‌తోనే దాడి
ప‌క్కా ప్ర‌ణాళితో టీడీపీ గూండాలు డాడుల‌కు తెగ‌బ‌డ్డారు. 
 
క‌మ్మ‌వారిపాలెం, మ‌ద్దిరాల, య‌డ‌వ‌ల్లి గ్రామాల‌కు చెందిన టీడీపీ గూండాలు ఎమ్మెల్యే కారు ఆ దారిలో వెళుతుండ‌టాన్ని గ‌మ‌నించారు. అప్ప‌టిక‌ప్పుడు మైకుల్లో క‌మ్మవారంతా ఏకంకావాల‌ని, వెంట‌నే అంతా రావాల‌ని ప్ర‌చారం చేశారు. టీడీపీ గుండాలంతా ఒక చోట‌కు చేరుకున్నారు. క‌ట్టుబ‌డివారి పాలెం గ్రామానికి విడ‌ద‌ల గోపి కారు రాగానే.. ఒక్క‌సారిగా టీడీపీ గూండాలు కారును అడ్డుకున్నారు. 
 
ఆ వెంట‌నే రాళ్లు, మార‌ణాయుధాల‌తో దాడుల‌కు తెగ‌బ‌డ్డారు. ఎమ్మెల్యే భ‌ర్త కుమార‌స్వామి, మ‌రిది గోపిని ఆ వైపు వెళ్తున్న వారు ద్విచ‌క్ర‌వాహ‌నాల‌పై ఎక్కించుకుని తీసుకెళ్ల‌డంతో పెను ముప్పు త‌ప్పింది. అయితే కారులోనే చిక్కుకుపోయిన ఎమ్మెల్యే బంధువుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. వారిని చికిత్స కోసం ఆప్ప‌త్రికి త‌ర‌లించారు. ఎమ్మెల్యే భ‌ర్త‌, గోపి స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.