ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 31 జులై 2020 (21:06 IST)

సెల్ ఫోన్ దొంగిలించాడని కరెంట్ షాక్ ఇచ్చి, అగ్గిపుల్లలతో బాలుడిని కాల్చి చంపారు

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. 13 సంవత్సరాల భరత్ అనే బాలుడు సెల్ ఫోన్‌ను దొంగిలించి విక్రయించేశాడు. దీంతో కోపంతో ఆ బాలుడికి విద్యుత్ షాక్ ఇచ్చారు. అంతటితో ఆగలేదు. విద్యుత్ షాక్‌కు తేరుకుని పైకి లేస్తున్న బాలుడిని అగ్గిపుల్లలతో శరీరంపై కాల్చారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన బాలుడు మృతి చెందాడు.
 
మదనపల్లె యాదవ వీధిలో నివాసముండే బన్నీ తన పెద్దనాన్న సెల్ ఫోన్‌ను దొంగిలించి తను అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ చాంద్ బాషాకు సెల్ ఫోన్‌ను విక్రయించాడు. విషయం కాస్త పెద్దనాన్నకు తెలిసింది. దీంతో భరత్‌ను ఇంటి మిద్దెపైకి తీసుకెళ్ళి ఖాళీగా ఉన్న గదిలో కట్టేసి కరెంట్ షాక్ ఇచ్చారు.
 
భరత్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి మధ్యాహ్నం తేరుకున్నాడు. మళ్ళీ అతడిని అగ్గిపుల్లలతో శరీరంపై కాల్చారు. దీంతో భరత్ స్పృహ తప్పి పడిపోయాడు. భరత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్ళే లోపే చనిపోయాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆడుతూపాడుతూ ఉన్న బాలుడు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.