గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వి
Last Updated : శుక్రవారం, 31 జులై 2020 (15:38 IST)

లాక్‌డౌన్ నాకు మంచి గుణపాఠం నేర్పిందంటున్న సినీ నటి సమంత

లాక్ డౌన్ సమయంలో తను ఇంట్లో చేస్తున్న పనులు గురించి సమంత ఆసక్తికర విషయాలను వివరించి చెప్పింది. అందరూ తమకు వచ్చిన పనులను సమర్థవంతంగా చేయడానికి ఇష్టపడతారు. కొందరు డ్యాన్స్, వంట చేయడం, కవిత్వం రాయడం వంటి పనులు చేస్తారు. అయితే వాటిని తను చేయలేనని తనకు తెలుసనని సమంత చెప్పారు.
 
ప్రతి ఒక్కరు చేసే దానికి తను భిన్నమని చెప్పారు. చాలా సులభమైన తోటపని సంబంధించి ఇప్పటికే తను సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేసానని తెలిపారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ ప్రకటించగానే అందరిలాగా తను ఆశ్చర్యపోయానని, ఆందోళన చెందానని తెలిపారు. సరకుల కోసం తన భర్తతో కలిసి తను సూపర్ మార్కెట్టుకు పరుగెత్తానని తెలిపారు.
 
తెచ్చుకున్న సరకులు ఎన్ని రోజులకు వస్తాయని లెక్కపెట్టుకున్నామన్నా రు. ఒకవేళ అవన్నీ అయిపోతే ఏమవుతుందనే ఆందోళన కూడా చెందామన్నారు. మనకు పోషకాలతో కూడిన ఆహారం లేదని చెప్పారు. ఈ పరిస్థితులన్నీ తనకు ఓ కొత్త పాఠాన్ని నేర్పిందన్నారు.