శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2019 (22:16 IST)

పదేళ్ళ బాలికపై అత్యాచారం, నడిరోడ్డుపై లాఠీతో బెండు దీశారు

చిన్నారులపై లైంగిక వేధింపులు ఈమధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తున్నా కొంతమంది కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లాలో జరిగిన సంఘటన అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
 
మదనపల్లి సమీపంలోని కలికిరి మండలం కొట్టాల గ్రామంలో 10 యేళ్ళ బాలికపై వీరభద్రయ్య అనే యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు ఈ రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని స్టేషన్ నుంచి మళ్ళీ గ్రామానికి తీసుకెళ్ళారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు వీరభద్రయ్య.
 
దీంతో స్థానికులు వీరభద్రయ్యను పట్టుకున్నారు. అతన్ని చావబాది పోలీసులకు అప్పజెప్పారు. తమ కళ్ళుగప్పి తప్పించుకుంటావంటూ పోలీసులు లాఠీని ఝళిపించారు. యువకుడిని చావబాదారు. సర్.. క్షమించండి.. ఇంకోసారి తప్పు చేయను అంటూ ఆ యువకుడు రెండు చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. అతడిని చావబాదారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని ఉరి తీయాలంటూ విద్యార్థి సంఘాలు కలికిరిలో నిరసన ర్యాలీ చేపట్టాయి.