ఆదివారం, 8 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (09:28 IST)

శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతికి డా.గజల్ శ్రీనివాస్ గాననివాళి (Video)

alluri - gazal song
శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జన్మదినోత్సవ వేడుకల్లో, అజాదీక అమృత మహోత్సవ సందర్భంగా శ్రీ అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఆవిష్కరించనున్నారు. 
 
దీన్ని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి అర్పిస్తూ డా. ముకుంద శర్మ గీతం గేయ రచన చేయగా, డా.గజల్ శ్రీనివాస్ సంగీత సారథ్యంలో, స్వీయ గానం చేసిన ప్రత్యేక గీతాన్ని విజయవాడలో జస్టిస్ ఆకుల వెంకట శేషశాయి తాగా ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా జస్టిస్ ఆకుల వెంకట శేష శాయి మాట్లాడుతూ శ్రీ అల్లూరి జీవిత చరిత్ర దేశభక్తి స్ఫూర్తికి పాఠ్యాంశం వంటిదని, ఆ చంద్రతారార్కం వారి త్యాగాన్ని ప్రపంచం గురుతుపెట్టుకుంటుదని అన్నారు.