ఆనందయ్య మందుపై 27న హైకోర్టులో విచారణ.. జగపతిబాబు మద్దతు
ఆనందయ్య మందు పంపిణీ చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల విచారణకు అనుమతించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ నెల 27న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది. ప్రభుత్వం మందు పంపిణీకి ఖర్చులు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్న పిటిషనర్లు… శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాలి అని హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. లోకాయుక్తా ఆదేశాల ప్రకారం మందు పంపిణీ అపారని పోలీసులు చెబుతున్నారని హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు.
లోకాయుక్తకి ఆ అధికారం లేదన్న పిటిషనర్… మందు పంపిణీ ఆపాలని అసలు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని కోర్ట్ కి వివరించారు. ఇక ఆనందయ్య మందు విషయంలో ఆయుష్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఏ విధమైన హానికారకాలు లేవు అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో కూడా పరిశోధనలు చేసారు.
ఇదిలా ఉంటే.. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్నా నాటు మందుకు చాలామంది మద్దతు ఇస్తున్నారు. తాజాగా నేపథ్యంలోనే ప్రముఖ నటుడు జగపతిబాబు కూడా ఆనందయ్యకు సపోర్ట్‌గా నిలిచాడు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆనందయ్యను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు.
"ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోంది. ఆనందయ్య గారి వైద్యానికి అధికారిక అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. అదే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ విధంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి అంటూ.." జగపతిబాబు ట్వీట్ చేశారు