సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్-19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ కూరుకుపోయారు. అధికశాతం మంది యువకులు నగరాలకు వలసపోవడంతో పాటుగా స్థానిక ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. కళలు పూర్తి ప్రమాదంలో పడ్డాయి.
ఈ కళలను కాపాడటానికి ఒకే ఒక్క ఆశాకిరణంలా మహిళలు నిలిచారు. కొండపల్లి కళల వైభవం మరియు వారసత్వంను ముందుకు తీసుకువెళ్తూ అభిహార ఇప్పుడు గ్రీన్ క్రాఫ్ట్ స్టోర్‌ను ప్రారంభించడంతో పాటుగా ఓ వర్క్‌షాప్‌ను మహిళల కోసం నిర్వహించింది. ఈ గ్రీన్‌క్రాఫ్ట్ స్టోర్ మరియు వర్క్‌షాప్‌ను నేడు డైరెక్టర్ ఆఫ్ హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ ఆంధ్రప్రదేశ్ , ఆప్కో డైరెక్టర్ శ్రీమతి సీ నాగరాణి, ఐఏఎస్; ఏపీ హ్యాండ్‌క్రాఫ్ట్స్ ఛైర్‌పర్సన్ శ్రీమతి బి విజయలక్ష్మి; అభిహార సోషల్ ఎంటర్‌ప్రైజ్ సీఈవో మరియు కో-ఫౌండర్ సుధారాణి ముళ్లపూడితో పాటుగా ఇతర ముఖ్య అతిథులు పాల్గొన్నారు
అభిహారకు ఐఏఎస్‌సీసీ (ద ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్) మద్దతునందిస్తోంది. ప్రొఫెసర్ అనిల్ కె సూద్ మరియు శ్రీమతి చిత్రా సూద్‌లు ఐఏఎస్‌సీసీ ప్రారంభించారు. గత రెండు సంవత్సరాలుగా మహోన్నత కారణానికి తమ మద్దతునందిస్తూ ఈ ఇనిస్టిట్యూట్ గ్రీన్ నేచురల్ డై ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. దీనిలో చేనేత మరియు కొండపల్లి బొమ్మలు కూడా భాగంగా ఉన్నాయి.
భారతదేశంలోని తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సస్టెయినబల్ హ్యాండ్లూమ్, క్రాఫ్ట్ ఆధారిత జీవనోపాధి గురించి కట్టుబడిన అభిహార ఇప్పుడు గ్రీన్‌క్రాఫ్ట్ స్టోర్-వర్క్‌షాప్‌ను ప్రకటించింది. ఈ చేనేత నైపుణ్యాలను కాపాడాలనే లక్ష్యంతో మరియు నిలకడైన పర్యావరణ వ్యవస్ధను సృష్టించడం ద్వారా ఉత్పత్తిదారులు (మహిళలు) స్థిరమైన ఆదాయంను సమానమైన పని ద్వారా పొందడంతో పాటుగా తమ ఉత్పత్తులకు స్థిరమైన డిమాండ్‌ను సైతం పొందగలరు. తద్వారా తమను తాము దారిద్య్రం నుంచి బయట పడేసుకుంటూ సామాజిక సాధికారితనూ పొందగలరు. మెరుగైన ఉత్పత్తి, డిజైన్ నైపుణ్యం, మార్కెట్ పరిజ్ఞానంతో మహిళా కళాకారులు తమ వారసత్వం, చరిత్రపై ఆధారపడి మరింతగా అభివృద్ధి చెందగలరు. కొండపల్లిలోని గ్రీన్ క్రాఫ్ట్ స్టోర్ ప్రత్యేకంగా మహిళలు తీర్చిదిద్దిన కళారూపాలను విక్రయిస్తుంది. అంతేకాదు దీనిని మహిళలే నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో కీలకాంశం ఏమిటంటే దీనివల్ల కేవలం ఈ కళలు మాత్రమే పునరుద్ధరించబడటం కాదు, అవి అభివృద్ధి చెందడమూ వీలవుతుంది.
అభిహార, ఓ సామాజిక వ్యాపార సంస్థగా కేవలం కమ్యూనిటీలతో అతి సన్నిహితంగా పనిచేయడం మాత్రమే కాదు, మహిళా కళాకారులకు తగిన శక్తినందించేలా అవసరమైన నైపుణ్యాలు, ఉపకరణాలను అందించడం ద్వారా స్వీయ వ్యాపార సంస్థలను తమ ఇంటికి దగ్గరలో ఏర్పాటుచేసుకునే అవకాశమూ కల్పిస్తుంది. ప్రధానస్రవంతి విలువ గొలుసుకట్టులో కమ్యూనిటీలను సైతం భాగం చేస్తామని భరోసా అందించడంతో పాటుగా వారు ఆదాయ భద్రత, సామాజిక భద్రత, మెరుగైన ఆరోగ్య సంరక్షణను పొందడం, సంక్షోభంను సైతం ధీటుగా ఎదుర్కొనే నేర్పు సంతరించుకోగలరనే భరోసా అందిస్తుంది. నాలుగు నెలల పాటు వర్క్‌షాప్‌ను నిర్వహించడం ద్వారా గతంలో పురుష కళాకారులు మాత్రమే చేయగలిగిన ఉలి, చెక్కడం వంటి కళారూపాలను యుక్త వయసులోని మహిళలు సైతం చేయడం, సహజసిద్ధమైన డైయింగ్, డిజిటల్ సాంకేతికత, వృత్తిపరమైన కమ్యూనికేషన్‌ను మహిళా కళాకారులకు అందించడం వీలవుతుంది.
ఈ ప్రారంభోత్సవ సందర్భంగా సుధా రాణి ముళ్లపూడి, సీఈవో; కో-ఫౌండర్-అభిహార సోషల్ ఎంటర్‌ప్రైజ్ మాట్లాడుతూ, మా కార్యక్రమాలు నిలకడైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తాయి. దీనిలో మహిళలు నిలకడగా ఆదాయం పొందగలరు. అదే రీతిలో సమానమైన పని కూడా పొందగలరు. తమ ఉత్పత్తులకు స్థిరంగా ఆదాయమూ పొందగలరు. తద్వారా తమను తాము దారిద్య్రం నుంచి బయటపడేసుకోవడంతో పాటుగా సామాజిక సాధికారితనూ పొందగలరు అని అన్నారు.
ఆమె మరింతగా మాట్లాడుతూ, ఓ మహిళకు తగిన సాధికారిత కల్పిస్తే, వీరు ఓ సమాజానికి సైతం తగిన సాధికారితను అందించగలరు. ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం కేవలం 50 మంది మహళలకు జీవనోపాధి అవకాశాలను అందించడం మాత్రమే కాదు, మొత్తం అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం సైతం గణనీయంగా పెంచడంఅని జోడించారు.
శ్రీమతి చిత్రా సూద్ , కో-ఫౌండర్- ఐఏఎస్‌సీసీ (ఇనిస్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ ఛాయిసెస్) మాట్లాడుతూ, అభిహారకు మా మద్దతు విస్తరిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. గత రెండు సంవత్సరాలుగా కొండపల్లి గ్రామంలో ఆ సంస్థ చేస్తోన్న అభివృద్ధి అపూర్వం. మేము మహిళలను కేవలం పర్యావరణ అనుకూల ఉత్పత్తులను వాడటం మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూల ప్రక్రియలను సైతం అనుసరించాల్సిందిగా కోరుతున్నాం. తద్వారా యంత్ర సామాగ్రి, విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తున్నాం. ఈ మహిళా కళాకారుల కళారూపాలు మా సుదీర్ఘమైన గో- గ్రీన్ లక్ష్యానికి అనుగుణంగా ఉంటాయి అని అన్నారు.
అభిహార మద్దతుతో కొండపల్లి అత్యద్భుతంగా పరివర్తన చెందింది. ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ సంస్థల మద్దతుతో పాటుగా భారీ స్థాయి సామాజిక సంస్థలు మరింతగా ముందుకు రావడంతో పాటుగా సామాజిక మద్దతునందిస్తారని, అంతరించే దశలో ఉన్న కళలను కాపాడటంతో అత్యంత కీలకమైన పాత్ర పొషిస్తారని గట్టి నమ్మకంతో ఉన్నాము అని అన్నారు.