శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (16:02 IST)

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం

vallabhaneni vamsi
సూర్యాపేట వద్ద గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ఎమ్మెల్యే వంశీ.. చివ్వెంల మండలం కాసీంపేట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఎమ్మెల్యే కాన్వాయిలో ఒకదానికొకటి వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ ప్రమాదంలో వంశీతో సహా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి