సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (17:18 IST)

మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడు : నాగబాబు

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. బీజేపీ - జనసేన పార్టీల పొత్తుపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. గుండు సున్నా దేనితో కలిపినా, తీసివేసినా దాని విలువలో ఎలాంటి మార్పు ఉండదంటూ ట్వీట్ చేశారు. 
 
దీనిపై మెగాబ్రదర్ నాగబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. జీరో విలువ తెలియని వెధవలకి ఏం చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుందని ఎద్దేవా చేశారు. ఇవాళ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ రంగం ఇంత అభివృద్ధి చెందిందంటే అది సున్నా మహత్యమేరా చదువుకున్న జ్ఞానం లేని సన్నాసుల్లారా అంటూ విమర్శించారు. 'మంది సొమ్ము మెక్కిన వెధవ కూడా నీతులు మాట్లాడుతున్నాడు, ఖర్మరా దేవుడా' అంటూ నాగబాబు ట్వీట్ చేశారు.