శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (17:43 IST)

ఒరేయ్.. ద్వారంపూడి.. సారీ చెప్పకుంటే బడితపూజ తప్పదు : జనసేన

తమ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓ దొం... కొడుకు. లం.. చేసే పనులన్నీ చేస్తుంటాడు అంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేనైనికులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఒరేయ్ ద్వారంపూడి.. 24 గంటల్లో క్షమాపణలు చెప్పకుంటే బడితపూజ తప్పదు అంటూ ఆ పార్టీ నేత, గుంటూరు జిల్లాకు చెందిన బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. 
 
సభ్యసమాజం తల‌దించుకునేలా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌పై వ్యాఖ్యలు చేశారన్నారు. రేపటిలోగా క్షమాపణ చెప్పకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతలు వాపును‌ చూసి బలుపు అనుకుని‌ విర్రవీగుతున్నారని మండిపడ్డారు. వీరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. 
 
అమరావతిలో మహిళలు కన్నీరు పెడుతుంటే .. వైఎస్ విజయలక్ష్మి, షర్మిల ఎందుకు స్పందించరని జనసేన నేతలు ప్రశ్నించారు. జగన్ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని వారు జోస్యం చెప్పారు. చంద్రబాబు ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని నేతలు నిలదీశారు. విశాఖలో వైసీపీ నేతలు ఇన్‌సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి జేఏసీకి మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటామని జనసేన నేతలు తెలిపారు.
 
 
పవన్ లం.. చేసే పనులన్నీ చేస్తాడు : వైకాపా ఎమ్మెల్యే  
అధికార వైకాపాకు చెందిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రెచ్చిపోయారు. నోటికి ఇష్టమొచ్చినట్టు బూతులు మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యణ్‌లను లం... కొడుకులు అంటూ సంబోధించాడు. అంతేకాకుండా, పప్పు లోకేశ్‌కు కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలంటూ వైకాపా శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 
ఆయన శనివారం స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఓపెన్ టాపు జీపులో ప్రచారం చేస్తూ వైకాపా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబు తన బినామీల కోసం బస్సు యాత్ర చేపడుతున్నారు. 
 
చంద్రబాబుని లం... కొడకా, వెధవ అని తిట్టాలని ఉంది. మొన్న ఎన్నికల్లో చంద్రబాబుకి సరైన బుద్ధి చెప్తాం. ఆ ముసలాడు మళ్లీ లేవకూడదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బాగా పని చేయాలి. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన వెధవ పనులన్నీ ప్రజలకు తెలియజెప్పాలి. చంద్రబాబు కొడుకు పప్పు లోకేష్ కూడా కొవ్వు కరిగేలా బుద్ధి చెప్పాలి.
 
పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్. చంద్రబాబు చెప్పుచేతల్లో నడిచే నువ్వు కూడా ఒక నాయకుడివేనా? పవన్ కళ్యాణ్ ఒక దొం.... కొడుకు. లం.. చేసే పనులన్నీ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అసలు రాజధానిని వెంటనే విశాఖకు తరలించాలి. అమరావతిలో బినామీలను బయటకు తేవాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లను జైల్లో వేయాలి అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రసంగించారు.