శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (13:08 IST)

యువతను టార్గెట్ చేసిన ఆ ముగ్గురు... యువభేరి, యువ చైతన్యయాత్ర, ఇష్టాగోష్ఠులు

ఒకరేమో టీడీపీ యువనేత నారా లోకేష్. మరొకరు రాష్ట్ర ప్రతిపక్షనేత వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి. మరొకరు సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురి లక్ష్యం ఇపుడు ఒక్కటే. 2019 ఎన్నికలే. ఇందుక

ఒకరేమో టీడీపీ యువనేత నారా లోకేష్. మరొకరు రాష్ట్ర ప్రతిపక్షనేత వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి. మరొకరు సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురి లక్ష్యం ఇపుడు ఒక్కటే. 2019 ఎన్నికలే. ఇందుకోసం ఈ ముగ్గురు ఇప్పటినుంచి పావులు కదుపుతున్నారు. యువతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం యువభేరి, యువ చైతన్యయాత్ర, ఇష్టాగోష్ఠులతో వేడెక్కిస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. 
 
జగన్ ఉత్తరాంధ్రలో సభ నిర్వహిస్తే జనసేన చీఫ్ పవన్ రాయలసీమలో విద్యార్థులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కోస్తాలోని మూడు జిల్లాల్లో యువ చైతన్యం పేరుతో విద్యార్థులతో ముఖాముఖి చేపట్టారు. ఇలా ముగ్గురు నేతలు, మూడు ప్రాంతాల్లో యువతను టార్గెట్ చేశారు. వీరందరి దృష్టి విద్యార్థుల ఓట్లపైనే. 
 
మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో ఓటు హక్కు లేని, వచ్చే ఎన్నికల నాటికి ఓటు హక్కు పొందే విద్యార్థులపై దృష్టి సారించారు. ముగ్గురు యువనేతల లక్ష్యం కూడా 2019 ఎన్నికలే. ఇప్పటికే జగన్ విద్యార్థులతో సమావేశాలతో బిజీగా ఉండగా, తాజాగా పవన్ కూడా అదే దారిలో పయనిస్తున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో సమీకరణాలు మారే అవకాశం ఉన్నా వాటితో సంబంధం లేకుండా విద్యార్థులను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు.