ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 21 నవంబరు 2017 (17:43 IST)

ఏపి ప్రజలకు మోడీ బోడి కొట్టారు... ప్రకాష్‌ రాజ్

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీకి అన్యాయం చేస్తున్న మోడీని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలన్నారాయన. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోడీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు ప్రకాష్‌ రాజ్. దీనిపై ప్రశ్నించా

ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు నటుడు ప్రకాష్ రాజ్. ఏపీకి అన్యాయం చేస్తున్న మోడీని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలన్నారాయన. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మోడీ పట్టించుకోకపోవడం దారుణమన్నారు ప్రకాష్‌ రాజ్. దీనిపై ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి... నిలదీయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై ఎక్కడ ర్యాలీలు చేస్తున్నా అంతా కలిసి పాల్గొనాలని పిలుపునిచ్చారు. 
 
ఏపీ ప్రజలకు మోడీ బోడి కొట్టారు... ఇది నిజం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒకటే రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడు ఎంతటి అభివృద్థి చెందిందో.... రెండుగా విడిపోయిన తరువాత ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో ప్రజలకు బాగా తెలుసునన్నారు. ఏపీకి తీరని అన్యాయం జరిగిందని మోడీ దీనిపై ఇప్పటికైనా మాట్లాడాలని ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇచ్చి తీరాలంటున్నారు ప్రకాష్ రాజ్.