గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 4 ఆగస్టు 2017 (14:19 IST)

నేను 'పెద్ద' కాపును - వైసిపి నుంచే పోటీ చేస్తా - పవన్‌కు హేమ షాకింగ్...

హేమ. నోరు తెరిస్తే చాలు గలాగలా మాట్లాడేస్తారు. ప్రతి డైలాగును ప్రేక్షకులు ఆసక్తిగా వినేలా చెబుతారు. ఆమె చేసే క్యారెక్టర్ ఏదైనా దానికి సరైన న్యాయం చేస్తుంది హేమ. అయితే హేమకు రాజకీయాలంటే పిచ్చి. ముందు నుంచి రాజకీయాల వైపు ఆసక్తి ఎక్కువ. దివంగత నేత వై.ఎస

హేమ. నోరు తెరిస్తే చాలు గలాగలా మాట్లాడేస్తారు. ప్రతి డైలాగును ప్రేక్షకులు ఆసక్తిగా వినేలా చెబుతారు. ఆమె చేసే క్యారెక్టర్ ఏదైనా దానికి సరైన న్యాయం చేస్తుంది హేమ. అయితే హేమకు రాజకీయాలంటే పిచ్చి. ముందు నుంచి రాజకీయాల వైపు ఆసక్తి ఎక్కువ. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అంటే హేమకు ఎంతో అభిమానం. అప్పట్లోనే రాజకీయాల్లోకి రావాలనుకున్న హేమ ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో విరమించుకున్నారు.
 
ఆ తరువాత జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తూ వచ్చారు. జగన్ పార్టీ పెట్టడంతో ఆ పార్టీలోకి వెళ్ళాలనుకుని నిర్ణయించుకున్నారు. కానీ పార్టీలో చేరితే ఎక్కువ సమయం కేటాయించాలి కాబట్టి వెనక్కి తగ్గారు. హేమ చేతిలో సినిమా అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆమె అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వైసిపిలోకి వెళ్ళాలని నిర్ణయాన్ని తీసేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానన్నారు. అది ఎమ్మెల్యేగానా, లేకుంటే ఎంపిగానా అన్నది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. 
 
వైసిపిలోకి హేమ వస్తే తీసుకునేందుకు జగన్ కూడా సిద్ధంగానే ఉన్నారు. సినీనటులు పార్టీలోకి వస్తే క్రేజ్ పెరుగుతుందనేది జగన్ ఆలోచన. అందులోను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి హేమ కావడం ఆమెకు ప్లస్ పాయింటయ్యింది. ఎక్కడ చూసినా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ ఓటర్లు ఉండటంతో హేమతో ప్రచారం చేయించి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్ళొచ్చనేది జగన్ ఆలోచన. 
 
హేమ వైసిపిలోకి వెళితే ఏ మాత్రం ముందుకు వెళుతుందనేది వేచి చూడాల్సిందే. అయితే రోజాకు చెక్ పెట్టడానికి హేమను పార్టీలోకి జగన్ తీసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు గతంలో పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఉన్నట్లుండి హేమ ఇలా అనేసరికి పవన్ పార్టీ కూడా షాక్ తిన్నట్లు సమాచారం.