శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (08:04 IST)

చిక్కుల్లో నటి శ్రియ.. లండన్ పోలీసుల విచారణ

అందాల నటి శ్రియ లండన్‌లో చిక్కుల్లో పడ్డారు. పోలీసుల విచారణ ఎదుర్కొన్నారు. ఆమె నటిస్తున్న తాజా తమిళ చిత్రం సందకారి. ఈ సినిమా షూటింగ్‌ లండన్‌లో చేస్తున్నారు.

స్థానిక స్టాన్‌స్టెడ్‌ విమానాశ్రయంలో కొన్ని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా.. శ్రియ పొరపాటున అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలోకి ప్రవేశించారు. వెంటనే ఆమెను సాయుధులైన పోలీసులు చుట్టుముట్టారు. సరైన పత్రాల్లేకుండా ఎందుకు వచ్చారంటూ ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.

సమీపంలోనే ఉన్న నటుడు విమల్‌ వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని వివరించారు. సినిమా షూటింగ్‌ చేస్తున్నామని పోలీసులకు చెప్పి, అవసరమైన పత్రాలన్నీ చూపించారు. శ్రియ పోలీసులకు క్షమాపణ చెప్పడంతో వదిలిపెట్టారు. అనంతరం షూటింగ్‌ జరుపుకొన్నారు.