శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (17:00 IST)

విద్యావిధానంలో చేసిన మార్పులు.. దేశానికే తలమానికం.. ఆదిమూలపు

గడచిన రెండేళ్లలో విద్యావిధానంలో చేసిన మార్పులు, సంస్కరణలు దేశానికే తలమానికంగా ఉన్నాయని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీ వ్యవస్థను కార్పొరేట్ విద్యా సంస్థలు నిర్వీర్యం చేశాయని పేర్కొన్నారు. 
 
నూజివీడులో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయెట్ సెంటర్‌ను అటామనస్ ఇనిస్టిట్యూట్‌గా గుర్తించి యూనివర్సిటీతో సంభంధం లేకుండా స్వయం ప్రతిపత్తి హోదాతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యాలయాల్లో ఉన్న కోర్సులను మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ఇంకా ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో డిగ్రీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులతో ‘ఇంటర్నన్ షిప్’ని చేయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు.