ఇంటర్ ఫలితాలపై త్వరలో నిర్ణయం : విద్యా మంత్రి ఆదిమూలపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షా ఫలితాల వెల్లడిపై ఆ రాష్ట్ర విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరోలనే ఇంటర్ పరీక్షల ఫలితాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదే అంశంపై ఆయన బుధవారం మాట్లాడుతూ, ఇంటర్ ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
అలాగే, పదో పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కరోనా కారణంగా ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఇప్పటికే రద్దయ్యాయి. ఫలితాల ప్రకటనపై విద్యార్థులంతా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఇతర రాష్ట్రాలు కూడా ఈ ఫలితాల వెల్లడిపై కసరత్ు చేస్తున్నాయి.