రేపే ఆదిత్య ఎల్-1 ప్రయోగం - ఇస్రో ఛైర్మన్ పూజలు
సూర్యుడి రహస్యాలను శోధించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో శనివారం ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ మిషన్‌కు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ శాటిలైట్‌ను పీఎస్ఎల్వీ సీ57 నింగిలోకి మోసుకెళ్లనుంది.
ఇప్పటికే చంద్రయాన్-3 విజయంతో చరిత్ర సృష్టించిన ఇస్రో... ఇపుడు సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు ఆదిత్య ప్రయోగాన్ని చేపడుతుంది. ఈ ప్రయోగంలో భాగంగా శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ57ను రాకెట్ ద్వారా ఆదిత్య ఎల్-1ను నింగిలోకి పంపనున్నారు.
శనివారం చేపట్టే ఈ భారీ ప్రయోగం నేపథ్యంలో సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారి ఆలయంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాకెట్ విజయవంతం కావాలని ఆయన పూజలు చేశారు. కాగా, ఈ ప్రయోగం కోసం ఇప్పటికే కౌంటడౌన్ ప్రారంభించారు.