శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (08:17 IST)

బాధ్యతలు స్వీకరించిన అర గంటలోనే ఏఎస్పీ బదిలీ.. ఎక్కడ?

adhiraj singh rana
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తాము చెప్పిందే వేదమనే రీతిలో వారి ప్రవర్తన ఉంది. ముఖ్యంగా, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు మంగళవారం జరిగిన సంఘటనే ఓ మంచి ఉదాహరణ. 
 
కర్నూలు జిల్లా ఆదోని ఏఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా నియమితులయ్యారు. దీంతో ఆయన మంగళవారం ఆదోనికి వచ్చి బాధ్యతలు స్వీకరించారు. కానీ, ఆ సంతోషం ఆయనకు ఎక్కువ సేపు నిలవలేదు. బాధ్యతలు స్వీకరించి కుర్చీలో కూర్చొన్న అరగంట వ్యవధిలోనే ఆయన బదిలీ అయినట్టుగా సమాచారం అందాయి. ఆయన అక్కడ నుంచి తిన్నగా వెళ్లిపోయారు. 
 
కాగా, రాణాను రంపచోడవరం నుంచి ఆదోనికి బదిలీ చేశారు. ఆయన డీఎస్పీ కార్యాలయానికి మంగళవారం ఉదయం 11.25 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అరగంటలోనే కర్నూలుకు రావాలని పై అధికారుల నుంచి ఏఎస్పీకి ఆదేశాలు అందాయి. దీంతో  ఆయన తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. 
 
కాగా, స్ట్రిక్ట్ అధికారిగా పేరున్న రాణా.. ఆదోని బదిలీ అయ్యారన్న వార్త తెలుసుకున్న స్థానిక అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో వారంతా ఇటీవల అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధిని కలిసి తమ బాధను వెళ్లబోసుకోవడంతో ఆయన ఆగమేఘాలపై తాడేపల్లికి వెళ్లి రాణాను బదిలీ చేయించినట్టు సమాచారం.