అగ్రీగోల్డ్ యాజమాన్యాన్ని నిలదీయాలి...
అగ్రిగోల్డ్ బాధితులను ఏళ్ళుగా వేధిస్తున్నసమస్య రికవరీ... దీనిపై కేవలం ప్రభుత్వంపైనే ఆధారపడితే సరిపోదని, రెండు వైపులా ఉద్యమం సాగించాలని అగ్రిగోల్డ్ పోరాట సమితి పిలుపునిస్తోంది. జనం సొమ్ము కొల్లగొట్టిన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని నిలదీయాలని, అలాగే, హామీల అమలు కోసం ప్రభుత్వంతో పోరాడాలని విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వీ రామారావు పిలుపు ఇచ్చారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే బాధ్యతను ఎమ్మెల్సీ అప్పిరెడ్డి తీసుకోవాలని హరినాథరెడ్డి డిమాండు చేశారు. నేటికి ఏడో రోజు అగ్రి గోల్డ్ బాధితు రిలే దీక్షలు జరుగుతున్నాయి. జనం సొమ్ము కొల్లగొట్టి కోట్ల రూపాయలు కూడబెట్టుకున్న అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇంటి ముందు బాధితులు ఉద్యమం చేపట్టాలని విశాలాంధ్ర దినపతిక ఎడిటర్ ఆర్వీ రామారావు సూచించారు.
అదే సమయంలో హామీల అమలు కోసం ప్రభుత్వంతో పోరాడాలని చెప్పారు. ఉద్యమాన్ని రెండు వైపులా సాగించాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన చేపట్టిన రిలే నిరాదీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలను ఆర్వీ రామారావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి హరినాథరెడ్డి, జిల్లా కార్యదర్శి అడిచేవి.
వనజ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. కర్నూలు జిల్లా, విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన బాధితులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆర్వీ రామారావు మాట్లాడుతూ ప్రజల డబ్బులను కొల్లగొట్టి (ప్రైవేటు సంస్థల యజమాన్యాలు ఆస్తులను అడ్డగోలుగా పోగేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కంపెనీలు దివాళా తీస్తున్నాయని, యాజమాన్యాలు మాత్రం కుబేరులుగా మిగిలిపోతున్నారని తెలిపారు.
ఇదే తరహాలో అగ్రిగోల్డ్ సంస్థ దివాళా, అయితే యాజమాన్యానికి రూ.23వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని స్వయంగా వారే ప్రకటించారని. గుర్తుచేశారు. తమను మోసం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యమే తిరిగి డిపాజిట్లు సొమ్ము మొత్తం చెల్లించేలా వారి ఇంటి ఎదుట బాధితులు దీక్షలు చేపట్టి అసలైన దోషులను నిలదీయాలని చెప్పారు. వారంలో న్యాయం చేస్తామని ఓట్లు పొంది గద్దె నెక్కిన ప్రభుత్వాన్ని హామీలు అమలు పరచాల్సిన నైతిక బాధ్యత ఉందని స్పష్టంచేశారు. ఓడించాలన్నారు.
పి.హరినాథరెడ్డి మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్న తరుణంలో వైసీపీ నుంచి కూడా ప్రస్తుత ఎమ్మెల్సీ అప్పిరెడ్డి నేతృత్వంలో ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి తాము కూడా పోరాడుతున్నామని చెప్పారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉండగా వారు చేసిన పోరాటంలో చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ముఖ్యమంత్రితో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అప్పిరెడ్డిపై ఉందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని డిపాజిటర్లు అందరికీ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.